News September 12, 2025

ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం

image

33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డీఈ నాగేశ్వర్ రావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ములుగు, ఏటూరునాగారం, మంగపేటతో సహా పలు సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరా ఉండదని ఆయన వివరించారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News December 14, 2025

పంచాయతీ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తి: కలెక్టర్ సంతోష్

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శాంతియుత వాతావరణంలో సజావుగా పూర్తయినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆదివారం మల్దకల్ ప్రభుత్వ పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News December 14, 2025

పార్వతీపురం: ‘మీ కోసం వెబ్ సైట్‌లో అర్జీలు సమర్పించవచ్చు’

image

PGRS అర్జీలను మీ కోసం వెబ్ సైట్‌లో నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలను సోమవారం స్వీకరిస్తామన్నారు.

News December 14, 2025

నిర్మల్: ఈ నెల 17న జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు

image

సహస్ర బాక్సింగ్ అకాడమీలో జిల్లాస్థాయి సీనియర్స్ బాలుర, బాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలను ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు జిల్లా బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి తెలిపారు. జనవరి 1985 నుంచి 31డిసెంబర్ 2006 మధ్యలో జన్మించిన వారు ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌తో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఎంపికైన వారు ఈ నెల 19న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి వాటిల్లో పాల్గొంటారని తెలిపారు.