News October 8, 2025
ములుగు: ట్రైబల్ వర్సిటీకి డిసెంబర్‌లో శంకుస్థాపన..!

సమ్మక్క, సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముందడుగు పడింది. నిన్న యూనివర్సిటీ లోగోను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భవన నిర్మాణాల ముహూర్తంపై సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. డిసెంబర్‌లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే కేంద్రం రూ.880 కోట్లు కేటాయించింది. ఇటీవలే రూ.25కోట్లతో ప్రహరీ పనులు ప్రారంభమయ్యాయి.
Similar News
News January 17, 2026
సైలెంట్‌గా దెబ్బకొట్టిన ఇండియా.. అమెరికా పప్పులపై 30% టారిఫ్స్

అమెరికా టారిఫ్స్‌కు వాటితోనే సైలెంట్‌గా బదులిచ్చింది ఇండియా. US పప్పుధాన్యాల ఎగుమతులపై 30% సుంకం విధించింది. నవంబర్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ట్రంప్‌కు సెనేటర్లు రాసిన లేఖతో ఇది బయటపడింది. ఈ టారిఫ్స్ వల్ల US రైతులపై చాలా ప్రభావం పడుతుందంటూ వారు వాపోయారు. ప్రపంచంలో పప్పుధాన్యాల అతిపెద్ద వినియోగదారు భారత్(27%). USపై కేంద్రం సైలెంట్‌గానే ప్రతీకారం తీర్చుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News January 17, 2026
పాతబస్తీ మెట్రోపై హైకోర్టు ఆరా.. ఫిబ్రవరి 4న కీలక నివేదిక!

MGBS-ఫలక్‌నుమా రూట్‌లో నిర్మించే మెట్రో లైన్ విషయంలో చారిత్రక కట్టడాల రక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. చార్మినార్ వంటి కట్టడాల దృశ్య సౌందర్యం దెబ్బతినకుండా పిల్లర్ల నిర్మాణం ఎలా ఉంటుందో వర్చువల్ వాక్‌త్రూ ద్వారా FEB 4లోగా చూపాలని అధికారులను ఆదేశించింది. వారసత్వ సంపదకు నష్టం వాటిల్లని రీతిలో మెట్రో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీని ఆధారంగానే 5.5KM మేర సాగే ఈ మెట్రో లైన్ ఖరారు కానుంది.
News January 17, 2026
మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.


