News September 11, 2025

ములుగు: తమ పార్టీ తీవ్రంగా నష్టపోయింది: మావో లేఖ!

image

ములుగు జిల్లా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలపై ఇటీవల వేల సంఖ్యలో పోలీస్ బలగాలు ఆపరేషన్ కాగార్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు కర్రెగుటను చుట్టుముట్టడానికి తమ పార్టీలోని ఒక వ్యక్తి కారణమని బుధవారం మావోలు ప్రకటన విడుదల చేశారు. ‘ముకాల్’ అనే వ్యక్తి పారిపోయి పోలీసులకు లొంగిపోయాడని, వారికి సమాచారం చెప్పడంతో కర్రెగుట్టపై పోలీసు బలగాల దాడిలో తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు.

Similar News

News December 12, 2025

కలిసొచ్చిన నిబంధన తొలగింపు.. సర్పంచ్‌గా గెలుపు

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడం పలువురికి కలిసొచ్చింది. గతంలో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ఆ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో జనగామ(D) కొత్తపల్లి సర్పంచ్‌గా ముక్కెర స్వరూప రవికుమార్ ఎన్నికయ్యారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.

News December 12, 2025

AP న్యూస్ రౌండప్

image

* నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ACB కోర్టు ఈ నెల 15న తీర్పు ఇవ్వనుంది.
* చంద్రబాబుపై ఫైబర్‌నెట్ కేసును మూసేయడాన్ని సవాల్ చేస్తూ YCP నేత గౌతమ్ రెడ్డి వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని ACB కోర్టు వెల్లడించింది.
* నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణపై పోలీసులు PD యాక్ట్ నమోదు చేశారు.
* ఈ నెల 10న ఒక్కరోజే 1,46,607 టన్నుల ధాన్యం కొనుగోలుతో రికార్డు సృష్టించాం: మంత్రి నాదెండ్ల

News December 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 94

image

ఈరోజు ప్రశ్న: పైన చిత్రంలో ఉన్న మహాభారత పాత్ర ఎవరిది? ఆయనను ఎవరు చంపారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>