News October 8, 2025

ములుగు: దళ కమాండర్‌ను హతమార్చిన మావోయిస్టులు?

image

ఈనెల 2న ఏటూరునాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో లభించిన గుర్తు తెలియని మృతదేహం మావోయిస్టు దళ కమాండర్ లక్కీదని తెలుస్తోంది. దసరా రోజు చెల్పాక అటవీ ప్రాంతంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నక్సల్స్ హతమార్చినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని ఓ ఏరియా దళ కమాండర్‌గా పనిచేస్తున్న మాడవి లక్కీని హతమార్చినట్లు స్థానికులకు మావోయిస్టులు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News January 13, 2026

10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ బంద్

image

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన యాడ్స్ ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు సూచించారు. కాగా 10 ని. నిబంధనను ఎత్తివేయాలంటూ కొత్త ఏడాదికి ముందు గిగ్ వర్కర్లు నిరసన చేపట్టారు. దీంతో సంస్థలకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

News January 13, 2026

వారసత్వ వ్యవసాయ భూములకు స్థిర స్టాంప్ డ్యూటీ: విశాఖ కలెక్టర్

image

పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సౌలభ్యం కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. వీలునామా లేకుండా వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములపై పార్టిషన్ డీడ్ నమోదు సందర్భంలో మొత్తం మార్కెట్ విలువ రూ.10 లక్షలు మించకపోతే రూ.100 స్థిర స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తామన్నారు. రూ.10 లక్షలు మించితే రూ.1000 స్థిర స్టాంప్ డ్యూటీ.

News January 13, 2026

BHPL: ఆస్తి కోసం తమ్ముడిపై అన్న కుటుంబం దాడి

image

గణపురం మండలం సీతారాంపురంలో ఆస్తి వివాదం నేపథ్యంలో అన్న, అతడి భార్య, కుమారులు కలిసి తమ్ముడిపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మహమ్మద్ సర్వర్ అహ్మద్‌పై తీవ్రంగా దాడి చేయగా తలకు గాయాలయ్యాయి. బాధితుడు భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై గణపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.