News September 13, 2025
ములుగు: నెమలిలా నృత్యం.. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం!

శాస్త్రీయ నృత్యంపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యరీతులు తమ పిల్లలకు నేర్పించేందుకు పేరెంట్స్ ముందుకు వస్తున్నారు. చిన్నారులు స్టేజిపై నెమలిలా నృత్యం చేస్తుంటే మురిసిపోతున్నారు. ఇటీవల రోజుల్లో ములుగు ప్రాంతంలో క్లాసికల్ డాన్స్‌కు క్రేజ్ పెరిగింది. పలువురు గురువులు వారాంతాల్లో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పోటీల్లో టాలెంట్ చూపి బాలలు ప్రైజ్‌లు గెల్చుకుంటున్నారు.
Similar News
News December 15, 2025
ఏలూరు SP ‘స్పందన’లో 38 ఫిర్యాదులు

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందినట్లు వివరించారు. ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఎక్కవ ఫిర్యాదులు అందినవని తెలిపారు.
News December 15, 2025
జైనథ్: ముచ్చటకు మూడోసారి సర్పంచ్‌గా గెలుపు

జైనథ్ మండలం కౌట గ్రామ సర్పంచ్‌గా బోయర్ శాలునా విజయ్ ఘన విజయం సాధించారు. గతంలో సైతం ఆమె సర్పంచ్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే ఆమె భర్త బోయర్ విజయ్ సైతం సర్పంచ్ సేవలందించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఈమారు సైతం విజయం సాధించడం విశేషం. ముచ్చటగా మూడోసారి వారు సర్పంచ్‌గా గెలపొందారు. గ్రామాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని వారు హర్షం వ్యక్తం చేశారు.
News December 15, 2025
మూడో విడత ఎన్నికలకు సిద్ధం చేయాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో ఆమె జూమ్ సమావేశం నిర్వహించారు. మూడో విడతలో 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు.


