News May 7, 2025
ములుగు: ‘పిల్లల పెరుగుదలపై శ్రద్ద వహించాలి’

పిల్లల పెరుగుదల, పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష అన్నారు. జిల్లాలోని 4 ఐసీడీఎస్ పరిధి అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ భవనాలు, మరుగుదొడ్లు, నీటి సరఫరా స్థితిగతులపై సీడీపీవోలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలు శిథిలావస్థకు చేరితే పిల్లలను వేరే అద్దె భవనాలకు మార్చలని సూచించారు.
Similar News
News February 18, 2026
ఫేక్ వెబ్‌సైట్లతో జాగ్రత్త: నిజామాబాద్ సీపీ

ఆన్‌లైన్ సెర్చింగ్ చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వాసులను సీపీ సాయి చైతన్య అప్రమత్తం చేశారు. సోషల్ మీడియాలో సెర్చ్ చేయగానే ఒరిజినల్ వెబ్‌సైట్ల మాదిరి కనిపించే నకిలీ సైట్లు ఉంటాయన్నారు. ఒక్క అక్షరం తేడాతో ఉండే ఫేక్ వెబ్‌సైట్లు కూడా ఉంటాయని, తెలియని సైట్లలోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని హితవు పలికారు.
News February 18, 2026
కామారెడ్డి: ‘పీఎంశ్రీ నిధులు వెంటనే ఖర్చు చేయాలి’

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, పీఎంశ్రీ కింద మంజూరైన నిధులకు సంబంధించి, సివిల్ వర్క్స్ ఈనెల 23వ తేదీలోపు పాఠశాలల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
News February 18, 2026
సింగరేణి గనులను సందర్శించిన RTI కమిషనర్లు

పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మొహసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డి బుధవారం ఆర్జీ-1 ఏరియాలోని బొగ్గు గనులను సందర్శించారు. వీరికి జి.యం లలిత్ కుమార్ గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి విధానాన్ని వివరించారు. అంతకుముందు కమిషనర్లు సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.


