News November 19, 2025

ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

image

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్‌తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.

Similar News

News January 23, 2026

సాఫ్ట్‌బాల్ స్టేట్ ఛాంపియన్ మన నిజామాబాద్

image

కమ్మర్‌పల్లిలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్(అండర్-17) పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్లు సత్తా చాటాయి. బాల, బాలికల విభాగాల్లో NZB జట్లు స్టేట్ ఛాంపియన్‌గా నిలిచినట్లు జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. బాలుర విభాగంలో వరంగల్(2వ), ఆదిలాబాద్(3), బాలికల విభాగంలో మెదక్(2), మహబూబ్‌నగర్(3) స్థానాల్లో నిలిచాయి. విజేతలు ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.

News January 23, 2026

త్వరలో మరో 2500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు: తుమ్మల

image

2,200 ఇందిరమ్మ ఇళ్లను ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు ఇచ్చామని, త్వరలో మరో 2,500 ఇండ్లు మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వానికి వీలైనంత వరకు పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తుందని చెప్పారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వం పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తుందని, పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నామన్నారు.

News January 23, 2026

కలికిరి: ఎల్లుండి మాజీ సీఎం రాక

image

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 25న కలికిరికి రానున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మ.12:30 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. 12:45 గంటలకు చంద్రగిరి మండలం మామండూరులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరి కలికిరి బీజేపీ కార్యాలయానికి సాయంత్రం 3:15గంటలకు చేరుకుంటారు. 26న కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.