News November 19, 2025
ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్‌తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.
Similar News
News January 21, 2026
అలర్ట్.. దుర్గమ్మ ఆలయం నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మకండి

కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో వస్తున్న నకిలీ ఫోన్ కాల్స్ పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈవో శీనానాయక్ కోరారు. కొంతమంది వ్యక్తులు ఆలయ సిబ్బందిమని చెప్పుకుంటూ భక్తులను మభ్యపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బుధవారం ఆయన తెలిపారు. ఇవి సైబర్ మోసాలు అయ్యే అవకాశం ఉందని, గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు లేదా నగదు పంపవద్దని సూచించారు. ఏదైనా సందేహం ఉంటే నేరుగా తమను సంప్రదించాలని స్పష్టం చేశారు.
News January 21, 2026
కంచికర్ల: ఉరేసుకుని వ్యక్తి మృతి

కంచికచర్ల పట్టణంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సొసైటీ బజార్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న అబ్బూరి హరిబాబు (35) సూసైడ్ చేసుకున్నాడు. కుమారుడి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురైన హరిబాబు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
News January 21, 2026
ఏలూరు: హెచ్చరిక.. ఎవరూ బయటకు రావద్దు!

బుట్టాయగూడెం మండలంలో పులి సంచారం నేపథ్యంలో బుధవారం రాత్రి ఎవరు బయటకు రావొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. గాడిద బోరు, ఇనుమూరు, దొరమామిడి ప్రజలు తెల్లవారు అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం సమీపంలో పులిసంచారం ఉందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.


