News May 7, 2025

ములుగు: వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్

image

వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు(65-70) వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.

Similar News

News February 13, 2026

నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

image

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.

News February 13, 2026

సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత అవగాహన సదస్సు

image

సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 18న ఐఈఎల్టీఎస్ (IELTS) పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికెట్లతో ఈనెల 17వ తేదీలోపు నేరుగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 13, 2026

కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

image

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.