News December 3, 2025
ములుగు: సర్పంచ్‌కు 286, వార్డుకు 1,109 నామినేషన్లు

జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. మొత్తం 52 సర్పంచ్ స్థానాలకు 286, 462 వార్డు స్థానాలకు 1,109 నామినేషన్లు దాఖలయ్యాయి. సయోధ్య కుదరని ఆశావాహులు చివరి రోజు వరకు వేచి చూసి నామినేషన్ వేశారు.
Similar News
News February 17, 2026
KMR: షబ్బీర్ అలీకి నా గురించి మాట్లాడే అర్హత లేదు: ఎమ్మెల్యే

కామారెడ్డి కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీకి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షబ్బీర్ అలీ గతంలో హైదరాబాద్‌లోని ఉగ్రవాదుల ఇంటికి వెళ్లిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. షబ్బీర్ అలీ గతంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ వద్ద ఎంత వసూలు చేశాడో తాను నిరూపిస్తానన్నారు.
News February 17, 2026
GMA గ్లోబల్ అధ్యక్షుడిగా ఖమ్మం వాసి

గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) అధ్యక్షుడిగా ఖమ్మం నగరానికి చెందిన విజయ్ దండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమెరికాలో ఐటీ కంపెనీ సీఈఓగా ఉన్న ఆయన ఖమ్మం ఐటీ హబ్‌లోనూ బ్రాంచ్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.
News February 17, 2026
మగువల ఆరోగ్యానికి మెంతిఆకు

మెంతి కూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలకు ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల అనీమియా రాకుండా ఉంటుంది. అలాగే క్యాలరీలు కూడా తక్కువ కాబట్టి వెయిట్‌లాస్‌కు దోహదపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. బాలింతలు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెనోపాజ్, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి, ఎ లతోపాటు బీటా కెరొటిన్ సమృద్ధిగా ఉంటుంది.


