News September 10, 2025
ములుగు: స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి: డీఈవో

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్-2025 కోసం అక్టోబర్ 6లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ములుగు డీఈవో ఏ.సిద్ధార్థరెడ్డి తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, అర్హత పరీక్షలో ఎంపికైతే 9, 10, ఇంటర్ రెండు సంవత్సరాలకు కలిపి నాలుగేళ్లకు గాను రూ.48,000 సాయం అందుతుందన్నారు. జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలన్నారు.
Similar News
News December 8, 2025
ఖమ్మం: మద్యం దుకాణాలు బంద్

డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.
News December 8, 2025
బాపట్ల: 108లో డ్రైవర్ల పోస్టుకు ఇంటర్వ్యూ

ప్రభుత్వ 108 వాహనంలో డ్రైవర్ల పోస్ట్‌కు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ బాలకృష్ణ సోమవారం తెలిపారు. ఈనెల 10, 11న గొల్లపూడిలోని విజయవాడ భవ్య హెల్త్ సర్వీసెస్ ఆఫీస్ వద్ద ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు 10th పాసై, హెవీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు పై తేదీలలో ఇంటర్వూకి హాజరుకావాలని సూచించారు.
News December 8, 2025
సకల సంపద ‘విష్ణుమూర్తే’

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః|
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||
ఈ సృష్టిలోని సమస్త సంపద ఆ విష్ణుమూర్తే. ఆయన మన మంచి కోరుతాడు. ఎప్పుడూ సత్యంగా, అందరిపట్ల సమానంగా ఉంటాడు. ఆ అమోఘుడు పద్మం వంటి కళ్లతో వర్షాన్ని కురిపిస్తాడు. కురిసే వర్షం కూడా ఆయనే. ఈ ప్రపంచంలో ఉన్న సంపద, సత్యం, సమానత్వం.. అన్నీ భగవంతుడి స్వరూపాలే. అందుకే, మనమంతా ఆయనను ప్రేమతో, భక్తితో ధ్యానించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


