News August 13, 2025
ములుగు: Way2News చేతిలో బలమైన ఆధారం

‘తునికాకు సేకరణ అవకతవకల్లో కదులుతున్న డొంక’ అని<<17390241>> Way2News<<>> వార్త ప్రచురించిన గంటల వ్యవధిలోనే బలమైన ఆధారం లభించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం సౌత్ రేంజ్ అటవీశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న రాము అనే కంప్యూటర్ ఆపరేటర్ తన భార్య బందెల స్వాతి, తల్లి సారమ్మ ఖాతాల్లోకి అక్రమంగా డబ్బులు జమ చేసినట్లు పిటిషన్లో వెళ్లడైంది. భార్య ఖాతాలో రూ.4లక్షలు, తల్లి ఖాతాలో రూ.2,89,000 అక్రమంగా జమ చేశాడు.
Similar News
News March 14, 2026
HYD: ఓల్డ్ సిటీ ఇక ‘హైటెక్’ గుమ్మం!

ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన టోలిచౌకీ వాసులకు త్వరలో కొత్త అనుభూతి పలకరించనుంది. టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా వరకు రోడ్డు మధ్యలో పచ్చని మీడియన్లు, ఫ్లైఓవర్ కింద అందమైన జంక్షన్లతో ఈ ప్రాంతం సరికొత్తగా ముస్తాబవుతోంది. సుమారు రూ.3.05 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ప్రయాణికులకు కంటికి ఇంపుగా, మనసుకు హాయినివ్వనున్నాయి. భాగ్యనగర వైభవం మీ గుమ్మం ముందుకు రాబోతోంది.
News March 14, 2026
10 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించిన నార్త్ కొరియా

నార్త్ కొరియా దాదాపు 10 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు సౌత్ కొరియా వెల్లడించింది. వీటి కెపాసిటీ, రేంజ్‌ను గుర్తించడం సాధ్యం కాలేదని తెలిపింది. జాయింట్ మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్న అమెరికా-సౌత్ కొరియాకు హెచ్చరికగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అణ్వాయుధ సామర్థ్యమున్న నార్త్ కొరియా మిస్సైల్స్ ప్రయోగం కలకలం రేపుతోంది.
News March 14, 2026
హనుమకొండ: ఇంటర్ పరీక్షకు 92% హాజరు నమోదు

జిల్లాలో నేడు నిర్వహించిన ఇంటర్ ఒకేషనల్ పరీక్షకు 92% హాజరు నమోదయింది. జిల్లాలో 905 మంది విద్యార్థులకు గాను 831 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 74 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.


