News June 19, 2024
ముల్కనూర్‌లో గుప్తనిధుల తవ్వకాలు!

భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మూడు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ రైతు మామిడి తోటలోని రావులమ్మ గుడి కింద గుప్తనిధులు ఉన్నాయని కొంత మంది JCB సహాయంతో తవ్వకాలు జరిపారని తోట యజమాని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News January 19, 2026
కరీంనగర్: ‘కార్టూన్.. సమాజాన్ని ప్రశ్నించే అస్త్రం’

సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి కార్టూన్ ఒక శక్తివంతమైన మాధ్యమమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. సోమవారం ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణను ఆమె ప్రారంభించారు. వేగవంతమైన ఈ ప్రపంచంలో తక్కువ సమయంలోనే లోతైన ప్రభావం చూపే శక్తి కార్టూన్లకు ఉందని, విద్యార్థులు ఈ కళను నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
News January 19, 2026
చల్లూరులోనే ఇసుక తవ్వకాలు.. నివేదిక సమర్పించిన కమిటీ

వీణవంక మండలం చల్లూరులో అనుమతి పొంది, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో ఇసుక తవ్వుతున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని విచారణ కమిటీ తేల్చింది. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. డీజీపీఎస్ సర్వే ప్రకారం చల్లూరు పరిధిలోనే మైనింగ్ జరిగిందని, ఇప్పలపల్లిలో అక్రమ తవ్వకాలు జరగలేదని నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బావులను తొలగించారని, నిబంధనలు పాటించాలన్నారు.
News January 19, 2026
కరీంనగర్ ప్రజావాణిలో 250 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 250 దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని బదిలీ చేశారు.


