News February 7, 2025
మూకమామిడి: ఫీల్డ్ అసిస్టెంటు మృతి

ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామ పంచాయితీ పరిధిలోని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గడ్డం నాగరాజు(33) మృతి చెందాడు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కొత్తగూడెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. నాగరాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 18, 2026
మార్చి 11న వైవీయూ కాన్వకేషన్ నిర్వహణ: వీసీ

YVU కాన్వకేషన్ మార్చి 11వ తేదీన నిర్వహించనున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు చేరాయన్నారు. వైవీయూ 11, 12, 13, 14వ కాన్వకేషన్ల ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకుంటారని చెప్పారు. కాన్వకేషన్ కోర్ కమిటీతో తన ఛాంబర్లో సమావేశమై నిర్వహణపై చర్చించారు.
News February 18, 2026
ఫేక్ వెబ్‌సైట్లతో జాగ్రత్త: నిజామాబాద్ సీపీ

ఆన్‌లైన్ సెర్చింగ్ చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వాసులను సీపీ సాయి చైతన్య అప్రమత్తం చేశారు. సోషల్ మీడియాలో సెర్చ్ చేయగానే ఒరిజినల్ వెబ్‌సైట్ల మాదిరి కనిపించే నకిలీ సైట్లు ఉంటాయన్నారు. ఒక్క అక్షరం తేడాతో ఉండే ఫేక్ వెబ్‌సైట్లు కూడా ఉంటాయని, తెలియని సైట్లలోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని హితవు పలికారు.
News February 18, 2026
కామారెడ్డి: ‘పీఎంశ్రీ నిధులు వెంటనే ఖర్చు చేయాలి’

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, పీఎంశ్రీ కింద మంజూరైన నిధులకు సంబంధించి, సివిల్ వర్క్స్ ఈనెల 23వ తేదీలోపు పాఠశాలల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.


