News August 12, 2025
మృతుని వివరాలు తెలిస్తే చెప్పిండి: ఆరిలోవ ఎస్ఐ

ఆదివారం అర్ధరాత్రి ఓల్డ్ డైరీ ఫార్మ్ సమీపంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న వ్యాను ఢీకొని సుమారు 40 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇప్పటివరకు మృతుని వివరాలు తెలియలేదు. వ్యక్తి వివరాలు గుర్తుపట్టిన వారు వెంటనే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ వై.కృష్ణ సూచించారు. ప్రస్తుతం మృతదేహం మార్చురీలో భద్రపరిచారు.
Similar News
News March 9, 2026
విశాఖ: విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News March 8, 2026
విశాఖ ఏయూ అంబేడ్కర్ చైర్ ‘AgriAI’ పరికరం

విశాఖ ఏయూ అంబేద్కర్ చైర్ రూపొందించిన ‘AgriAI’ అనే వినూత్న పరికరాన్ని డైరెక్టర్ మనోజ్ తివారీ ప్రారంభించారు. ఇది IoT, AI సాంకేతికతతో పంటలను ఆశించే పురుగులను గుర్తించి, పంట స్థితిగతులను ఫొటోలతో సహా రైతులకు విశ్లేషిస్తుంది. LLM ఇంటిగ్రేషన్‌తో పనిచేసే ఈ పరికరం వ్యవసాయ క్షేత్రాల్లో విజయవంతంగా పరీక్షించబడింది, ఇది రైతులకు చీడపీడల నివారణలో ఎంతగానో తోడ్పడనుంది.
News March 8, 2026
BREAKING: విశాఖలో ఐటీ దాడుల కలకలం

విశాఖలోని మధురవాడ, అక్కయ్యపాలెం సహా నాలుగు ప్రాంతాల్లోని ‘సెలబ్రేషన్స్ హోటల్’ శాఖలపై ఆదివారం ఐటీ అధికారులు దాడులు చేశారు. జీఎస్టీ రిటర్న్స్‌లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో కంప్యూటర్ డేటా, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఇతర హోటల్ యజమానులు తమ రికార్డులను సరిచూసుకుంటున్నారు.


