News August 22, 2025

మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన సీపీ

image

SRSP ప్రాజెక్టును సీపీ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం సందర్శించారు. సీపీ మాట్లాడుతూ.. ప్రాజెక్టుపై సందర్శకుల తాకిడి పెరుగుతున్న సందర్భంగా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. SRSP ప్రాజెక్ట్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నందున గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తం చేయాలని సూచించారు. నది పరిసర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News January 14, 2026

ఫేక్ రిఫండ్లతో ₹5 కోట్లు కొల్లగొట్టాడు

image

e-కామర్స్ ప్లాట్‌ఫాంల రిటర్న్ సిస్టమ్ లూప్‌హోల్స్‌ను ఆసరా చేసుకొని ఓ యువకుడు రిఫండ్ కింద ఏకంగా ₹5Cr కొల్లగొట్టాడు. చైనాలో లూ అనే వ్యక్తి కాస్మొటిక్ షాపింగ్ ప్లాట్‌ఫాంలో 11900 ఫేక్ రిఫండ్ రిక్వెస్టులు పెట్టాడు. తనకు వచ్చిన వస్తువుల్ని తిరిగి సెకండ్స్ కింద మార్కెట్లో అమ్మేవాడు. 2024లో రిఫండ్‌లపై అనుమానంతో ఓ కంపెనీ ఫిర్యాదు చేయగా స్కామ్ బయటపడింది. చివరకు కోర్టు అతనికి 6ఏళ్ల జైలుశిక్ష విధించింది.

News January 14, 2026

జగిత్యాల: కేంద్రానికి స్పీడ్ పోస్టుల వినతులు

image

పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ.. 2026-27 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తమ గోడును వినిపించేందుకు ‘స్పీడ్ పోస్టు’ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రాలు పంపినట్లు పేర్కొన్నారు.

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో సీఎం ‘నిశ్శబ్ద విప్లవం’

image

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.