News November 30, 2025

మెగా పీటీఎం పక్కాగా నిర్వహించాలి: అనకాపల్లి డీఐఈవో

image

డిసెంబర్ 5న జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు పక్కాగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మద్దిలి వినోద్ బాబు స్పష్టంచేశారు. సమావేశంలో యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, అర్థ సంవత్సర పరీక్షల్లో విద్యార్థుల ప్రగతి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. హోలిస్టిక్ ప్రోగెస్ కార్డులు ఇవ్వాలన్నారు. సమావేశం ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

Similar News

News February 12, 2026

మెదక్: నేడు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాధికారి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించి, పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News February 12, 2026

మంత్రాలయ మహాత్యం

image

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనం అతి పవిత్రమైనది. 1671లో స్వామివారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. ఆయన భౌతికంగా మనకు కనిపించకపోయినా, మరో 700 ఏళ్ల పాటు అందులోనే ఉంటూ అనుగ్రహిస్తారని ప్రతీతి. కల్పవృక్షంలా కోరిన కోర్కెలు తీర్చే ఈ క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. స్వామివారికి సమర్పించే ‘మృత్తిక’ (పవిత్ర మట్టి) సకల వ్యాధులను, గ్రహ దోషాలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News February 12, 2026

జనగామ: ఒకే కుటుంబం.. మూడు తరాల ఓట్లు!

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో మూడు తరాలకు చెందిన ఓ కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. మున్సిపల్ పరిధిలోని శివునిపల్లిలోని సుదర్శనం-సరోజన దంపతులకు చెందిన మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకే వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదర్శన్ దంపతులతో పాటు కొడుకులు, కోడళ్లు, మనుమరాళ్లు, బిడ్డ, అల్లుడు మొత్తం తొమ్మిది మంది ఓటేశారు.