News September 10, 2025
మెట్‌పల్లి నుంచి RTC ప్రత్యేక TOUR

MTPL నుంచి ఈనెల 12న టూర్ ఏర్పాటు చేసినట్లు DM దేవరాజ్ తెలిపారు. బీదర్ స్వయంభూ వినాయక, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, హుమ్నాబాద్ మాణిక్ ప్రభు ఆలయం, గుల్బర్గా, గనుగాపూర్ దత్తాత్రేయ ఆలయం, అక్కలకోట స్వామి సమర్థ ఆలయం, పండరిపూర్, విట్టల్, తుల్జాపూర్, పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం, నాందేడ్ సిక్ గురుద్వార దర్శనమనంతరం తిరిగి 14న
బస్సు మెట్‌పల్లి చేరుకుంటుందన్నారు. ఛార్జీ రూ.4000. వివరాలకు: 9959225927.
Similar News
News December 12, 2025
ఒకే జిల్లాలో 7,400 HIV కేసులు

బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 HIV కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 400 మంది చిన్నారులున్నారు. వీరికి తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ జిల్లాలో ప్రతి నెలా 40-60 దాకా కేసులు నమోదవుతున్నాయని, ప్రస్తుతం 5వేల మందికి పైగా వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరైన అవగాహన, టెస్టింగ్ లేకపోతే వ్యాధి మరింత వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News December 12, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో FINAL పోలింగ్ శాతం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లోని 85 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 79.57 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
కరీంనగర్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లోని 92 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 81.82 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.


