News March 7, 2025

మెట్‌పెల్లి ఏఎంసీ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

image

మెట్‌పెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన పసుపు, ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. పసుపులో, ధాన్యంలో రకాల గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పసుపు, ధాన్యం కొనుగోలు ఎలా చేస్తున్నారు. ఎక్కడికి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారని అధికారులను అడిగి రైతులతో కాసేపు ముచ్చటించారు. పంటలో వారికి వచ్చే లాభ నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 16, 2025

నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

image

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.

News December 16, 2025

సంక్రాంతికి విజయనగరంలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

image

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విజయనగరం ఆర్టీసీ వారు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో జీ.వరలక్ష్మి తెలిపారు. విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి జనవరి 8-14వ తేదీ వరకు ప్రతీ రోజు విజయవాడ, భీమవరం, రాజోలు, విశాఖకి ప్రత్యేక బస్సులు నడుపుటకు వెల్లడించారు. ఈ బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేవని.. సాధారణ ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి చెప్పారు.

News December 16, 2025

NGKL: మూడో విడతలో 158 గ్రామాలకు ఎన్నికలు

image

NGKL జిల్లాలో ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రం ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం ఏడు మండలాల పరిధిలోని 158 గ్రామపంచాయితీలలో 1,364 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అచ్చంపేట, పదర, ఉప్పునుంతల, బల్మూరు, లింగాల, చారకొండ, అమ్రాబాద్ మండలాలలో ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.