News August 23, 2025

మెదక్‌లో నేటి నుంచి క్రీడా ఉత్సవం

image

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ఈనెల 23, 24న మెదక్‌లో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరగనుంది. ఇందులో పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ పోటీల్లో తమ జట్లను ఉచితంగా నమోదు చేసుకొని పాల్గొనవచ్చు. గెలిచిన మొదటి నాలుగు జట్లకు నగదు బహుమతి ఉంటుంది. పోటీలను వీక్షించడానికి వచ్చే ప్రజలు కూడా సరదా ఆటలు ఆడుతూ వేడుకలో పాల్గొనవచ్చు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు జరుగుతాయి.

Similar News

News January 20, 2026

చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్

image

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ రాజేంద్రన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో జేసీగా ఉన్న విద్యాధరి వైజాగ్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. పలువురు రెవెన్యూ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News January 20, 2026

నంద్యాల జిల్లాకు దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో దేశంలోనే అతిపెద్ద సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్టుతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

News January 20, 2026

ఫోన్‌పే IPOకు SEBI ఓకే

image

ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే IPOకు SEBI గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియంత్రణ సంస్థ సూచనలతో అప్‌డేట్ చేసిన DHRPని ఫోన్‌పే త్వరలోనే సబ్మిట్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో IPOకు వస్తుండటంతో కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ద్వారా కొత్తగా నిధులు సమకూరే అవకాశాలు లేవు. ఫ్రెష్ ఇష్యూలు కూడా ఉండవని తెలుస్తోంది. IPO విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత UPI లావాదేవీల్లో 45% ఫోన్‌పే యాప్‌ ద్వారానే జరుగుతున్నాయి.