News November 5, 2025
మెదక్‌లో రేపటి నుంచి 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 జోన్-III(బాలికలు) 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ క్రీడాపోటీలు ఈ నెల 6 నుండి 8 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల(ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర) వేదికగా ఈ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
మెదక్: ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ త్వరితగతిన పూర్తి చేయాలి’

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News January 12, 2026
మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 12, 2026
వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: కలెక్టర్

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.


