News October 6, 2025

మెదక్: ఈనెల 8న కేంద్ర బృందం పర్యటన

image

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఈ నెల 8న జిల్లాలో పర్యటించనున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుందన్నారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీఘనపూర్, పాపన్నపేట మండలాల్లో పర్యటన కొనసాగుతుందన్నారు. ఈ బృందంలో ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖ, NRSCకి చెందిన అధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.

Similar News

News January 14, 2026

టేక్మాల్: పతంగి ఎగరేస్తూ బిల్డింగ్ నుంచి పడ్డాడు!

image

టేక్మాల్ గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. భవనంపై పతంగి ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి లక్ష్మణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మొదటి అంతస్తు నుంచి పడటంతో లక్ష్మణ్ కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News January 13, 2026

మెదక్: సంరక్షణ కిట్లు అందజేయడం హర్షణీయం: కలెక్టర్

image

రైతులు పురుగుమందులు పిచికారి చేసే సమయంలో వారి ఆరోగ్య పరిరక్షణకు సంరక్షణ కిట్లు అందజేయడం జిల్లా వ్యవసాయ శాఖ పనితీరు హర్షణీయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా పూల బొకేలుకు బదులు సంరక్షణ కిట్లు అందజేయాలన్న కలెక్టర్ పిలుపుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

News January 13, 2026

మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టింగ్‌లు

image

మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్‌గా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజానర్సింహా, ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతులు మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.