News August 31, 2024
మెదక్: ఒకే రోజు ముగ్గురి సూసైడ్

ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. దుబ్బాకకి చెందిన నవీన్(25) అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరేసుకోగా.. చిన్నచింతకుంటకు చెందిన యువకుడు(17) హస్టల్‌లో ఉండి చదువుకో అని తల్లిదండ్రులు మందలించడంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌కు చెందిన సందీప్(37) మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 15 తండ్రితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు.
Similar News
News February 17, 2025
మెదక్: రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు

నూతనంగా నియామకమైన పోలీస్ సిబ్బందికి రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలలో పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.
News February 17, 2025
మెదక్: ప్రజల సమస్యలను పరిష్కరించాలి: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు త్వరగా పరిశీలించాలని సూచించారు.
News February 17, 2025
కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం: హరీశ్‌రావు

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ‘కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ హరీశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.