News November 19, 2025
మెదక్: కక్షపూరిత కేసులపై బీఆర్ఎస్ సీరియస్.. డీజీపీకి ఫిర్యాదు

మెదక్ బీఆర్‌ఎస్ టౌన్ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులుపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసును రద్దు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని బీఆర్‌ఎస్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హాని అన్నారు. ఆంజనేయులుపై కేసును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 17, 2026
మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News January 17, 2026
మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.
News January 17, 2026
మెదక్ మున్సిపాలిటీలు.. మహిళలకే పట్టం!

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా గర్జన వినిపించనుంది. ఛైర్‌పర్సన్ పీఠాలన్నీ మహిళలకే రిజర్వు కావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. మెదక్ స్థానం బీసీ మహిళకు దక్కగా.. తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో ఆశావహుల సందడి మొదలైంది. వార్డుల వారీగా రిజర్వేషన్లను కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు.


