News November 19, 2025
మెదక్: క్రీడా ఉత్సవాల ముగింపులో పాల్గోన్న ఎంపీ

జిల్లా కేంద్రంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్-17విభాగంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గోని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం గెలుపొందిన ఇరు జట్లకు బహుమతులు అందజేశారు. MP మాట్లాడుతూ.. క్రికెటర్ తిలక్ వర్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.
Similar News
News January 14, 2026
మెదక్: యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 10వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్‌కు దూరం, తాగునీటి సౌకర్యం, ర్యాంపులు, ఇతర ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
News January 14, 2026
జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.
News January 14, 2026
మెదక్: జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

అధికారులు అత్యుత్తమ సేవలతో జిల్లా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ టేబుల్, వాల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ప్రెసిడెంట్ విట్టల్, సెక్రటరీ నాగభూషణం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ట్రెజరర్ ఎల్లయ్య ఉన్నారు.


