News April 12, 2024

మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే: హరీశ్ రావు

image

మెదక్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి రుద్రారంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాల పొంగు లాగా ఉందన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత స్పీడ్ గా పెరిగిందో, అంతే వేగంగా పడిపోయిందన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.

Similar News

News December 12, 2025

మెదక్: రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్, 163 BNSS అమల్లో ఉంటాయని చెప్పారు. ర్యాలీలు, ప్రచారం, గుమిగూడడం పూర్తిగా నిషేధం. ఎన్నికలు శాంతియుతంగా జరుగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

News December 12, 2025

మెదక్‌లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్ పూర్తి

image

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రెండో, మూడో విడతల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసిన సిబ్బందికి, ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందు విడతల మాదిరిగానే 14, 17 తేదీల పోలింగ్‌ను నిర్వహించేందుకు అధికారులను కలెక్టర్ సూచించారు.

News December 11, 2025

మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

image

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ‌భారతి లక్పతి నాయక్ ‌ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.