News March 15, 2025

మెదక్: గ్రూప్-3 స్టేట్ టాపర్‌గా అర్జున్ రెడ్డి

image

పాపన్న పేటకు చెందిన అర్జున్ రెడ్డి గ్రూప్-3 స్టేట్ టాపర్‌గా నిలిచాడు. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఆయన 339 మార్కులతో స్టేట్ ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-2లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించారు. ఈయన ఇంజినీరింగ్ చేసి, ప్రస్తుతం హవేలీ ఘనపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూ, మెదక్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.

Similar News

News February 13, 2026

నగరంలో 291 మంది పోలీసులకు రివార్డులు

image

నగరంలోని గత నెలలో వివిధ కేసుల్లోని ప్రతిభ చూపించిన 291 పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబత్ర బాగ్చి రివార్డులు అందజేశారు. వివిధ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి సీఐ వరకు మెరిట్ ఆధారంగా గుర్తించి రివార్డులు క్రైమ్ మీటింగ్లో అందించారు. మిగతా సిబ్బంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో మరింత పనిచేయాలన్నారు.

News February 13, 2026

రిలయన్స్‌కు వెనిజులా ఆయిల్.. లైసెన్స్ ఇచ్చిన అమెరికా!

image

వెనిజులా నుంచి డైరెక్ట్ ఆయిల్ కొనేందుకు రిలయన్స్‌కు US లైసెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆంక్షల భయం లేకుండా ఆ కంపెనీ ఇకపై అక్కడి నుంచి నేరుగా క్రూడాయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న రిలయన్స్‌కు దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత అక్కడి ఆయిల్ ఇండస్ట్రీని US శాసిస్తోంది. మరోవైపు ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గనున్నాయి.

News February 13, 2026

మేడ్చల్: 3 రంగుల జెండాను నిలబెట్టిన ముగ్గురు ‘లత’లు!

image

మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉద్దమర్రి వార్డులకు చెందిన రాజీగళ్ల లత, పెద్దిరెడ్డి లత, దోసకాయల లత కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒకే పేరుతో బరిలోకి దిగిన ఈ ముగ్గురు హస్తం గుర్తు మీద విజయం సాధించారు. ఎంసీపల్లిలో కారు స్పీడ్‌కు ఈ ముగ్గురు బ్రేకులేయడం చర్చనీయాంశమైంది. ఒకే పేరుతో ముగ్గురు కౌన్సిలర్లు కొలువుదీరడం గ్రామంలోనే కాదు మున్సిపాలిటీ అంతటా ఆసక్తిగా మారింది.