News August 14, 2025

మెదక్: చారిత్రాత్మక ఖిల్లా త్రివర్ణ మయం

image

79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మెదక్ చారిత్రాత్మక ఖిలా త్రివర్ణమైంది. మూడు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఖిల్లాలో పాటు ప్రభుత్వ కార్యాలయాలను మువ్వన్నెల రంగుల దీపాలతో సుందరీకరించారు. రాత్రి వేళ ఖిలా మువ్వన్నెల రంగులతో పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేడుకల కళ వచ్చేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఇక్కడ జెండా ఎగురవేయనున్నారు.

Similar News

News March 13, 2026

పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన డీఈవో

image

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను డీఈఓ శుక్రవారం పరిశీలించారు. పాల్వంచలోని రెజీనా పాఠశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల సిట్టింగ్ సౌకర్యాలను తనిఖీ చేశారు. ఎండల దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

News March 13, 2026

రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో 14కి చేరిన మృతుల సంఖ్య

image

రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ మేరకు చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి(55) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య అధికారి డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 14కి చేరింది. అయితే వైద్యులు రెడ్డి అనంత లక్ష్మికి చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.

News March 13, 2026

వనపర్తి: క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండటం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కొత్తకోట పీహెచ్సీలో సనచారిటబుల్ ట్రస్ట్, ఎం.ఎన్.జె క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారిని ముందుగా పరీక్షలతో గుర్తించడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చన్నారు.