News August 10, 2024
మెదక్ జిల్లాలో మహిళల ముందడుగు
పట్టణ మహిళా సంఘాలకు కొన్ని సంస్థలు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వ్యాపార రంగంలో ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.49.65 కోట్లు రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోగా.. రూ.85 కోట్లు దాటి శత శాతాన్ని మించాయి. కిరాణం, కుట్టుపని, దుస్తుల విక్రయం, వ్యవసాయం, పాడి పశువుల పెంపకం తదితర జీవనోపాధికి ఇలా అనేక రంగాల్లో రాణిస్తున్నారు.
Similar News
News September 10, 2024
దుబ్బాక: ఆస్తి విషయంలో తండ్రితో గొడవ.. కొడుకు సూసైడ్
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవపడి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమి పంపకం చేయాలని తండ్రి వెంకయ్యతో కొడుకు గంట బాలయ్య(39) 3న గొడవపడ్డాడు. పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని తండ్రి చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు గుళికలు మింగాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.
News September 10, 2024
ప్రజ్ఞాపూర్: నిమజ్జనం లేని గణపతికి నిత్య పూజలు
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని పురాతన ఆలయంలో మహాగణపతి నిత్య పూజలు అందుకుంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం. ప్రజ్ఞాపూర్ లో మహా గణపతి విగ్రహం స్వయంభుగా కొలువైన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని స్థానికులు తెలుపుతున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
News September 10, 2024
సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
లక్ష్మీబాయి రక్ష ప్రశిక్షణ పేరుతో పాఠశాలలో అమలు చేయనున్న కరాటే శిక్షణ కోసం ఈనెల 16 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఎంపికైన వారు పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ నేర్పించాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.