News May 7, 2025
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్వాపూర్ వాసి మృతి

బిక్కనూర్ మండలం బస్వాపూర్‌కు చెందిన వంక లింగం(55) శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో లింగం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట పోలీసులు తెలిపారు.
Similar News
News February 13, 2026
పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి: విలియం కటింగ్

జమ్మలమడుగు పట్టణంలోని సీఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్‌ను పూర్వ వైద్యుడు డాక్టర్ విలియం కటింగ్ సందర్శించారు. శుక్రవారం ఆయన హాస్పిటల్లోని ప్రతి వార్డులో తిరిగి తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.1961-1973 నాటికి, ఇప్పటికీ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందిందని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం 6.30కు ఫొటో ఆల్బమ్ విడుదల చేస్తామని హాస్పిటల్స్ సూపరిటెండెంట్ డాక్టర్ అగస్టిన్ రాజ్ తెలిపారు.
News February 13, 2026
వేములవాడ మున్సిపాలిటీలో హంగ్

వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 28 వార్డులకు కాంగ్రెస్ 13 చోట్ల జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 5 వార్డులకే పరిమితమైంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ ఛైర్‌పర్సన్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీకి మరొక కౌన్సిలర్ మద్దతు ఏర్పడింది.
News February 13, 2026
పాలమూరు: సీఎం సొంతగడ్డపై కాంగ్రెస్ హవా!

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో కాంగ్రెస్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు 10 కైవసం చేసుకొని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మద్దూరు 12 స్థానాలకు హోరాహోరి పోరు సాగినప్పటికీ 9వార్డులు గెలిచి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కోస్గి మున్సిపాలిటీలో 16 స్థానాలకు గాను ఇప్పటికే 8 గెలిచి కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుంది.


