News March 25, 2024
మెదక్ జిల్లాలో వృద్ధుడి దారుణ హత్య

మెదక్ జిల్లా కౌడిపల్లి శివారులో గల బతుకమ్మ తండా సమీపంలో వృద్ధుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్యం భూమయ్య(70) ఆదివారం రాత్రి తన వ్యవసాయ పొలం దగ్గర హత్యకి గురయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలీంచారు. క్లూస్ టీంతో కలిసి సమాచారం సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 11, 2025
మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.
News December 11, 2025
మెదక్: ‘ఉపాధ్యాయులకు ఓడి అవకాశం కల్పించాలి’

మెదక్ జిల్లా విద్యాధికారిని గురువారం ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఓడి సదుపాయం కల్పించాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయకు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.
News December 11, 2025
మెదక్: 88.46% ఓటింగ్‌గా తేల్చిన అధికారులు

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.


