News November 19, 2025

మెదక్: ‘డ్రగ్స్ నిర్మూలనకు ముందుకు రావాలి’

image

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది, అధికారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం రవాణా అక్రమ విక్రయం వంటి కార్యకలాపాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తాయన్నారు. అరికట్టడానికి పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News January 20, 2026

గణతంత్ర దినోత్సవ వేడుకలను పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటులేకుండా చూడాలన్నారు.

News January 20, 2026

తూప్రాన్: యువతి ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన గిరిజన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సంపల్లి గ్రామానికి చెందిన ధరావత్ మమత(18) ఈనెల 16న విష పదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా లక్ష్మక్కపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు. మమతకు ఇటీవల వివాహం కూడా నిశ్చయమైనట్లు సమాచారం.

News January 20, 2026

కౌడిపల్లి: బాత్రూంలో పడి యువకుడి మృతి

image

కౌడిపల్లి మండలం వెల్మకన్నకు చెందిన యువకుడు బాత్రూంలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు… దేశాయిపేట గణేశ్ శర్మ(28) హైదరాబాద్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నాడు. సోమవారం బాత్రూంలో పడిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే గణేశ్ శర్మ వివాహం జరిగింది.