News November 19, 2025
మెదక్: తండ్రి దాడిలో గాయపడ్డ వంశీని పరామర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ కేంద్రంలో చికిత్స పొందుతున్న వంశీని కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో మద్యం మత్తులో తండ్రి కొడుకు వంశీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీ వద్దకు వెళ్లి కలెక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News January 23, 2026
మెదక్: దుర్గం చెరువులో యువ వ్యాపారి డెడ్ బాడీ

మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. మృతుడిని కేపీహెచ్‌బీ ప్రగతినగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి నిమ్మల నరేశ్ (25)గా గుర్తించారు. ఇతని స్వగ్రామం మెదక్ జిల్లా శంకరంపేట మండలం కొత్తపేట అని పోలీసులు తెలిపారు. నరేశ్ మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 22, 2026
రామాయంపేటలో నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశం

రామాయంపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై విచారణకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గత రెండేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలు, పనుల ఖర్చులపై నిజానిజాలు తేల్చేందుకు జిల్లా ఆడిట్ అధికారిని విచారణాధికారిగా నియమించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. త్వరలోనే ఆడిట్ అధికారి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నారు.
News January 22, 2026
గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పొడగింపు

తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ ఆఫీసర్ అనురాధ తెలిపారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈనెల 21 వరకు గడువు ఉండగా 25 వరకు పొడిగించినట్లు తెలిపారు. 2026- 27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. అవకాశం వినియోగించుకోవాలని ఆమె కోరారు


