News September 10, 2025
మెదక్: తొమ్మిది నెలల్లో 648 మంది సూసైడ్

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 648 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 204, మెదక్‌లో 228, సిద్దిపేటలో 216 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
Similar News
News December 10, 2025
ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి, ఊరుకొండ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సామగ్రి పంపిణీ విధానాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పరిశీలించారు. ఎన్నికల బృందాల హాజరు, పోలింగ్ మెటీరియల్ అందజేత, రవాణా వాహనాల సంసిద్ధతను సమీక్షించారు. పోలింగ్ సిబ్బందికి అల్పాహారం, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
News December 10, 2025
కడప నగర నూతన YCP మేయర్ ఇతనే.!

కడప నగర నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
News December 10, 2025
క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.


