News April 25, 2024
మెదక్: నేటితో 23 మంది 36 నామినేషన్లు దాఖలు

నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారంతో ముగిసింది. నేటితో 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు 54 మంది అభ్యర్థులు 90 నామినేషన్లను దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. మెదక్ 26వ స్థానం

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మెదక్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4826 మంది పరీక్షలు రాయగా 3310 మంది పాసై 68.59 శాతంతో స్టేట్‌లోనే 26వ స్థానం వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 539 మందికి 460మంది పాసై 85.34 శాతంతో 3వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 649 మందికి 187 మంది పాసై 28.81%తో 28వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో16 మందికి 11 మంది పాసై 68.75%తో 1వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. స్టేట్‌లోనే మెదక్ 28 స్థానం

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మెదక్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5710 మంది పరీక్ష రాయగా 3156 మంది పాసై 55.27 శాతంతో స్టేట్‌లోనే 28 ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 599 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 440 మంది విద్యార్థులు పాసై 73.46 శాతంతో స్టేట్‌లో 1వ స్థానంలో నిలిచింది.
News April 12, 2026
MDK: సాసర్ పిట్స్‌తో దాహం తీర్చుతున్న అటవీ శాఖ

మెదక్ జిల్లాలో ఎండల తీవ్రతతో అడవుల్లో వాగులు ఎండిపోవడంతో వన్యప్రాణులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ‘సాసర్ పిట్స్’ (సిమెంట్ కుంటలు) జంతువులకు ప్రాణాధారంగా మారాయి. కెమెరా ట్రాప్‌లలో చిరుతలు, జింకలు నీరు తాగుతున్న దృశ్యాలు నమోదవుతున్నాయి. ఈ కుంటలు జంతువులు గ్రామాల వైపు రాకుండా అడ్డుకుంటూ రక్షణ కల్పిస్తున్నాయి. అధికారులు నిరంతరం నీరు నింపుతూ పర్యవేక్షిస్తున్నారు.


