News December 3, 2025

మెదక్: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కొల్చారం, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని 183 సర్పంచ్, 1,523 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు

Similar News

News February 7, 2026

మెదక్: మున్సిపల్ బరిలో న్యాయవాది

image

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో యువ న్యాయవాది జీవన్ రావు పోటీ చేస్తున్నారు. 2016లో లా పట్టా అందుకున్న జీవన్ రావు ప్రస్తుతం మెదక్ కోర్టులో ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 7వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రావు సతీమణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి 6వ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

News February 7, 2026

మెదక్: క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి: ఏఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. ప్రతి పోలీసు రోజూ వ్యాయామం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. చట్టం అందరికీ సమానమని, చట్ట వ్యతిరేకులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.

News February 6, 2026

మెదక్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాడు. మేడ్చల్ జిల్లా కొనాయిపల్లికి చెందిన గుంటి నవీన్ కూచారంలో అంత్యక్రియలకు హాజరై బైక్‌పై వెళ్తున్నాడు. కాళ్లకల్ మైకో కంపెనీ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.