News March 28, 2024
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. కొద్ది రోజులుగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో తాత్సారం జరిగిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మలతో పాటు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసిన విషయం తెలిసిందే. చివరకు నీలం మధు పేరును ప్రకటించారు.
Similar News
News February 16, 2026
మెదక్: 4 ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అదనపు పోలీస్ బలగాలను మొహరించి, పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టారు.
News February 16, 2026
మెదక్: పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
News February 16, 2026
మెదక్: మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా: ఎస్పీ

మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 163 BNSS ( సెక్షన్ 144) ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.


