News March 5, 2025

మెదక్: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్‌‌పై నిషేధం

image

మెదక్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ రక్షణ చట్టం 1986 లోని సెక్షన్‌ 5 కింద ఆదేశాలు జారీ చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కావున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మంచినీరు తాగేందుకు స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ఉపయోగించాలని సూచించారు.

Similar News

News December 14, 2025

మెదక్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ నమోదు

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు సగటున 21.83 % పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా ఓటింగ్ శాతం ఇలా ఉంది. తూప్రాన్ 25.49 %, మనోహరాబాద్ 23.03 %, చేగుంట 19.52 %, నార్సింగి 18.04 %, రామాయంపేట్ 22.14 %, నిజాంపేట్ 18.56 %, చిన్నశంకరంపేట్ 20.85 %, మెదక్ 27.99 % పోలింగ్ నమోదైంది.

News December 14, 2025

మెదక్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్: అదనపు ఎస్పీ

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. చిన్నశంకరంపేటలో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి, వృద్ధురాలికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా సహాయం అందించారు.

News December 14, 2025

మెదక్ జిల్లాలో నేడు పంచాయతీల ఎన్నికలు

image

మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 7 గ్రామ పంచాయతీలు, 254 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1,034 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2News చూస్తూ ఉండండి.