News January 19, 2026
మెదక్: ‘బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
Similar News
News February 15, 2026
మెదక్: 16న మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక

మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలను ఈనెల 16న పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉ.11 గంటలకు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మ.12:30 గంటలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. సమావేశానికి కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
News February 14, 2026
మెదక్: రేపు 11లోపు Form-A సమర్పించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ అధికార ప్రతినిధిత్వానికి సంబంధించి Form-Aని రేపు ఉ.11 గంటలలోగా సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. అలాగే Form-Bని ఎన్నిక రోజు ఉ.10 గంటల వరకు అందజేయాలని సూచించారు. గడువులోపు మార్పులకు అవకాశం ఉంటుందని, ఎన్నికల సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కోరారు.
News February 14, 2026
మెదక్: ఏడుపాయల జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగే ఏడుపాయల వనదుర్గ మాత జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాంగణాన్ని సిసి కెమెరాల నిఘాలో ఉంచామన్నారు. భద్రత కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.


