News March 5, 2025

మెదక్: మహిళతో శారీరకంగా కలిసి.. చివరికి

image

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని మాయమాటలు చెప్పి గుమ్మడిదల కల్లు షాప్ నుంచి ఆమెను నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. శారీరకంగా కలసి, చున్నీతో ఆమె గొంతుకు చుట్టి ఉపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.

Similar News

News December 11, 2025

వంగూరు: ముఖ్యమంత్రి సొంత మండలంలో కాంగ్రెస్‌కు భారీ షాక్

image

వంగూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి మద్దతుదారు పురుగుల యాదయ్య ముదిరాజ్ గురువారం రికార్డు విజయం సాధించారు. గ్రామ పంచాయతీ చరిత్రలోనే అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన యాదయ్యకు 909 ఓట్లు పోలయ్యాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, సీపీఎం, కాంగ్రెస్ రెబల్ వర్గాలు యాదయ్యకు మద్దతు పలికాయి. మొత్తం 11 వార్డులను ప్రతిపక్షం క్లీన్ స్వీప్ చేసింది.

News December 11, 2025

గిరిజన సంక్షేమ శాఖలో బాషా పండితులకు తీపి కబురు

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతిపై మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తెలుగు పండిట్స్ 227, హింది పండిట్స్ -91, పీఈటీలు 99.. మెుత్తం 417 మంది గిరిజన శాఖలో స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతులు పొందనున్నారు. సీఎం చంద్రబాబుకి మంత్రి ధన్యవాదములు తెలిపారు.

News December 11, 2025

ఎస్‌ఐఆర్ పూర్తికి సహకరించండి: కర్నూలు ఆర్వో విశ్వనాథ్

image

కర్నూలు అసెంబ్లీలో ఎస్‌ఐఆర్‌ను బూత్ స్థాయిలో ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆర్వో పి.విశ్వనాథ్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ వివరాలు, చిరునామా, ప్రోజనీ సమాచారాన్ని తప్పనిసరిగా బూత్ యాప్‌లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్నూలులో 2,74,803 ఓటర్లలో ఇప్పటివరకు 37,561 మ్యాపింగ్, 15,821 ప్రోజనీ పూర్తి అయ్యాయన్నారు.