News March 5, 2025
మెదక్: మహిళపై అత్యాచారం.. ఆపై హత్య

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన పూర్య 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీ(38)ని కల్లు షాప్ నుంచి నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి, చున్నీ ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News December 15, 2025
రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లాకు 3వ స్థానం

అనంతపురం జిల్లాలో జరిగిన ఐదో రాష్ట్రస్థాయి డాన్స్ స్పోర్ట్స్ పోటీలలో కర్నూలు జిల్లాకు మూడో స్థానం లభించినట్లు రాష్ట్ర సంఘం కార్యదర్శి సురేంద్ర ఆదివారం తెలిపారు. జిల్లా కార్యదర్శి నాగేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీలలో కర్నూలు జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ సాధించినట్లు తెలిపారు. సభ్యులు అమరేశ్, శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
News December 15, 2025
వారిపై చర్యలు తీసుకోండి: మంత్రి

శ్రీ సత్యసాయి జిల్లా ఓడీచెరువులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సవిత ఆదేశించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్‌తో ఆదివారం మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. హాస్టల్‌లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుపై రావడానికి కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశించారు.
News December 15, 2025
ఒంటిమిట్ట వద్ద ఘోర ప్రమాదం.. యువకుడి దుర్మరణం

మండలంలోని ఒంటిమిట్ట చెరువు కట్టపై ఆదివారం రాత్రి బైకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. గోవిందమాల వేసుకొని తిరుమల పాత్ర వెళుతున్న ఎర్రగుంట్లకు చెందిన జగదీశ్(20)ని ఒంటిమిట్ట చెరువు కట్ట పైకి రాగానే రాజంపేట, బాసింగరిపల్లికి చెందిన కత్తి వెంకటేశ్(27) బైకుపై వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిలో జగదీశ్ చికిత్స పొందుతూ కడప రిమ్స్‌లో మృతిచెందాడు.


