News March 6, 2025

మెదక్: మెదటి రోజు 6410 మంది హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల, టీజీఆర్ఎస్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా 6,410 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 6,180 మంది పరీక్షకు హాజరయ్యారు. 230 వివిధ కారణాల వల్ల పరీక్షకు హాజరుకాలేదన్నారు.

Similar News

News January 22, 2026

మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

image

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

News January 22, 2026

మెదక్ నుంచి ఢిల్లీలో పోటీలకు ఎంపిక

image

మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను అదనపు ఎస్పీ మహేందర్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.