News February 5, 2025
మెదక్: రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం జిల్లా క్రీడాకారులు

మెదక్ జిల్లాకు చెందిన రగ్బీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్17 సెమీ కాంటాక్ట్ రబీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. వెండి పతకం సాధించిన రగ్బీ క్రీడాకారులను మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కర్ణం గణేశ్ రవికుమార్ అభినందించారు.
Similar News
News February 7, 2025
గజ్వేల్‌లో యాక్సిడెంట్.. ఇద్దరి దుర్మరణం

గజ్వేల్ పరిధిలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గోదావరిఖని నుంచి HYD వైపు వెళ్తున్న కారు, ఆగి ఉన్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండటంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
News February 7, 2025
ఆత్మహత్యలు కాదు.. కొట్లాడుదాం.. ప్రజలకు హరీశ్ రావు పిలుపు

లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామ సభలో పురుగు మందు తాగిన ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమని హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ అన్నారు. ఆత్మహత్యలు వద్దు.. కొట్లాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.
News February 7, 2025
సర్పంచ్ ఎన్నికలు: మెదక్ జిల్లా పూర్తి వివరాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన మెదక్ జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు, 4 మున్సిపాలిటీలు, 21 మండలాలు ఉన్నాయి. మసాయిపేట కొత్త మండలం ఏర్పాటుతో ZPTC, MPP పదవులు, ఒక MPTC స్థానం పెరగనున్నాయి. ప్రస్తుతం జడ్పీటీసీ-21, ఎంపీపీ-21, ఎంపీటీసీ-190, గ్రామ పంచాయతీలు 492 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.