News August 22, 2025
మెదక్: రేపు డయల్ యువర్ డీఎం

మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ శుక్రవారం తెలిపారు. రేపు ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సౌకర్యాలపై సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని డీఎం పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
MDK: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బైక్ నియంత్రణ తప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై యువకుడు మృతి చెందినట్లు హవేలిఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దూప్ సింగ్ తండాకు చెందిన సుభాష్(34) మెదక్ నుంచి ఇంటికి వస్తుండగా శివారులో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ కోలుకోలేక మరణించాడు. కుటుంబంలో చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది.
News January 23, 2026
సైన్స్ ఫెయిర్‌లో మెదక్ జిల్లాకు 3 బహుమతులు

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా ప్రతిభ చాటిందని డిఈఓ విజయ తెలిపారు. టీచర్ ఎగ్జిబిట్ విభాగంలో కొడపాక జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు వెంకటరమణ ప్రథమ స్థానం సాధించారు. విద్యార్థుల విభాగంలో తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి 3వ స్థానం, సిద్ధార్థ రూరల్ స్కూల్ విద్యార్థి అక్షయ్ 4వ స్థానంలో నిలిచారు. విజేతలను డిఈఓ అభినందించారు.
News January 23, 2026
మెదక్: 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

ఈ నెల 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఓటరు దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహన ర్యాలీపై అధికారులతో సమీక్షించారు. నా భారత్ – నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు.


