News April 26, 2024
మెదక్: రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట యువకుడి మృతి

తూప్రాన్ మండలం యావాపూర్ వద్ద రాత్రి జరిగిన <<13123863>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతుడు సిద్దిపేట జిల్లాకు చెందిన ఎండీ ఖాజామియా(30)గా గుర్తించారు. రాయపోల్ మండలం ఎల్కంటి గ్రామానికి చెందిన ఖాజామియా.. గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటూ నీటి శుద్ధి మెకానిక్‌గా పనిచేస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్ వైపు నుంచి గజ్వేల్ వైపు వెళ్తుండగా యావపూర్ చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది.
Similar News
News April 14, 2026
మెదక్: వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి: కలెక్టర్

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడదెబ్బ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు.
News April 14, 2026
మెదక్: రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ

అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రారంభించారు.
News April 14, 2026
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలనునిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ శ్రీనివాస్ రావుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


