News April 22, 2024

మెదక్: విద్యార్థులు… అభద్రతకు గురికావొద్దు !

image

ఇంటర్‌ పరీక్ష ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని DMHO‌ శ్రీరామ్‌ సూచించారు. పరీక్షలో ఫెయిల్‌ అయితే అభద్రతకు గురికావద్దన్నారు. పట్టుదలతో చదివి సప్లిమెంటరీలో పాస్‌ కావాలన్నారు. అంతే తప్ప విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైతే కౌన్సెలింగ్‌ కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 14416కు ఫోన్‌ చేసి వైద్యుల సలహాలు పొందవచ్చన్నారు.

Similar News

News December 6, 2025

ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల సంఘం నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

News December 6, 2025

మెదక్: చివరి రోజు 521 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News December 6, 2025

మెదక్: నేడు రెండో విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

image

మెదక్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.