News September 10, 2025

మెదక్: విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

image

చేగుంట మండలం చిటోజిపల్లికి చెందిన తలారి గోవర్ధన్(32) అనే యువ రైతు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య తలారి స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 11, 2025

మెదక్: 88.46% ఓటింగ్‌గా తేల్చిన అధికారులు

image

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.

News December 11, 2025

BREAKING: పాపన్నపేట మండలంలో తొలి విజయం

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దౌలాపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు రేషబోయిన అంజయ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి సునీత మీద 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

News December 11, 2025

మెదక్: మధ్యాహ్నం 1 గంట వరకు 86 % పోలింగ్

image

మెదక్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు 86 % పోలింగ్ నమోదైంది. ఇంకా అనేక చోట్ల ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ పూర్తయ్యాక సిబ్బంది మధ్యాహ్న భోజనం తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి విడతలో ప్రధానంగా హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పెద్ద శంకరంపేటలో పోలింగ్ కొనసాగుతుంది.