News April 25, 2024

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో హత్యల కలవరం..

image

మెదక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురి హత్యలు జిల్లాల్లో కలకలం రేపుతున్నాయి. కోహిర్ వద్ద ఆటో అద్దె డబ్బులు విషయంలో గొడవ జరిగి జగద్గిరిగుట్టకు చెందిన షేక్ అన్వర్ అలీ(30)ని మిత్రులు దాడి చేసి హతమార్చారు. నర్సాపూర్ ఎర్రగుంట తండాకు చెందిన సక్కుబాయి(48) ప్రవర్తన నచ్చక కొడుకు హంజా హత్య చేశాడు. శెట్‌పల్లి కలాన్‌లో భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు దశరథ అత్త కౌసమ్మ(50)ను హత్య చేశాడు.

Similar News

News April 18, 2026

ప్రకృతి నడుమ ఆధ్యాత్మికతకు ప్రతీక ఏడుపాయల ఆలయం

image

ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. ఏడూ వాగులు సంగమించే ప్రదేశంలో వెలసిన వన దుర్గాభవాని అమ్మవారిని దర్శించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారు. పురాణాల ప్రకారం అమ్మవారు స్వయంభువుగా వెలసి భక్తులను కాపాడుతున్నారని విశ్వాసం. మహాశివరాత్రి, జాతర సమయంలో ఆలయం సందడిగా మారుతుంది. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది.

News April 18, 2026

చరిత్రకు సజీవ సాక్ష్యం మెదక్ ఖిల్లా

image

మెదక్‌లో చారిత్రక కీర్తిని చాటుతూ నిలిచిన మెదక్ ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోట కాకతీయుల కాలంలో నిర్మాణం చెంది, అనంతరం కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు అభివృద్ధి చేశారు. బలమైన గోడలు, అద్భుత నిర్మాణ శైలి ఖిల్లా వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పైభాగం నుంచి కనిపించే ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాంత చరిత్రను గుర్తు చేస్తూ వారసత్వ చిహ్నంగా ఇది నిలిచింది.

News April 18, 2026

జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్

image

తూప్రాన్ ఐవోసీ భవనంలో శుక్రవారం జనగణనపై అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బ్లాకులుగా విభజించి పకడ్బందీగా గణన చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి, MRO చంద్రశేఖర్ రెడ్డి, MPDO సతీశ్ పాల్గొన్నారు. గణన సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.