News February 8, 2025

మెదక్: సభల ఏర్పాటుపై అధికార, ప్రతిపక్ష పార్టీల ఫోకస్

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారీ సభలు పెట్టి బలప్రదర్శన చేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తున్నాయి. ఇందుకు ఉమ్మడి మెదక్ జిల్లాను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ త్వరలో భారీ బహిరంగ సభ పెట్టుకుందామని ప్రకటించగా, ఈ మేరకు గజ్వేల్ లేదా నర్సాపూర్‌లో ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ సభకు ధీటుగా జోగిపేట లేదా గజ్వేల్‌లో సభ పెట్టాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

Similar News

News February 10, 2026

కపిలతీర్థం: Photo Of The Day

image

తిరుపతిలోని కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం భూత వాహనంపై శ్రీకామాక్షి సమేత సోమస్కందమూర్తి దర్శనం ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో స్వామివారిని ఊరేగించారు. కపిలతీర్థం సర్కిల్ వద్ద స్వామివారు, శివలింగం ఒకే ఫ్రేమ్‌లో కనపడేలా తీసిన ఫొటో వైరలవుతోంది.

News February 10, 2026

పాక్ యూటర్న్ విలువ ₹1,500 కోట్లు!

image

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌పై పాక్ యూటర్న్ తీసుకోవడంతో ICC సహా గ్లోబల్ బ్రాడ్‌కాస్టర్లకు దాదాపు ₹1,500 కోట్ల ఆదాయం మిగిలింది. మ్యాచ్ రద్దయి ఉంటే మీడియా పార్ట్‌నర్ అయిన జియోహాట్‌స్టార్‌కు ICC భారీ పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. అలాగే 10 సెకన్ల యాడ్‌కు ₹25-40 లక్షల చొప్పున సుమారు ₹200-300 కోట్ల యాడ్ రెవెన్యూ పోయేది. స్పాన్సర్‌షిప్‌లు, డిజిటల్ ట్రాఫిక్, హోటల్ బుకింగ్‌ల రూపంలో మరింత లాస్ తప్పేది కాదు.

News February 10, 2026

KMR: ఓటేయడానికి వెళ్తున్నారా..! ఇవి తప్పనిసరి

image

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓటేసి ప్రతి ఓటరు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఉపాధి హమీ జాబ్ కార్డ్, ఇండియన్ పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా బుక్, పోస్టాఫీసు ఖాతా బుక్ ఇలా 18రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకెళ్లాలని తెలిపారు.