News December 2, 2025

మెదక్: సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్

image

పంచాయతీ పోరులో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్‌పై రాసిచ్చిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హవేలిఘనపూర్ మం. రాజిపేటతండాకు చెందిన ఓ అభ్యర్థి తానును ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.2వేలు, అన్ని కులాల పండుగలకు రూ.20వేలు సహా ఇతర హామీలతో బాండ్ పేపర్ రాసిచ్చారు. ఈ హామీలు అమలు చేయకుంటే పదవీ నుంచి తొలగించాలంటూ పేర్కొన్నారు. కాగా ఈ బాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Similar News

News February 13, 2026

BIG BREAKING: లక్షెట్టిపేటలో BJP అభ్యర్థి మృతి

image

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు BJP అభ్యర్థి బత్తిని లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. నామినేషన్ వేసిన తర్వాత మూడో రోజు నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో లక్ష్మి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

News February 13, 2026

పాకిస్థాన్‌తో మ్యాచ్.. అభిషేక్ ఆడే ఛాన్సుందన్న వరుణ్

image

T20 WC: పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిన్న మ్యాచ్ అనంతరం చెప్పారు. అభి బాగానే కనిపించాడని, ప్రాక్టీస్ కూడా చేశాడని తెలిపారు. మరోవైపు అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచులకు అందుబాటులో <<19122478>>ఉండకపోవచ్చని<<>> నిన్న మ్యాచుకు ముందు కెప్టెన్ సూర్య పేర్కొన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. కాగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ తలపడనున్నాయి.

News February 13, 2026

RR: 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక

image

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు వెళ్లడైన వెంటనే ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రారంభంకానుంది. ఈ నెల 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.